సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దష్ట్యా కాకినాడ - హైదరాబాద్, హైదరాబాద్-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాకినాడ-హైదరాబాద్ (07002) ప్రత్యేక రైలు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 4.20 కి ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయం 4.45 గంటలకు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో హైదరాబాద్-కాకినాడ (07001) 7వ తేదీ రాత్రి 10.40 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరుతుంది. రాత్రి 11.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, ఆకివీడు, కైక లూరు, గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుంది.
హైదరాబాద్-కాకినాడ (07101) మరో ప్రత్యేక రైలు సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ-హైదరాబాద్ (07102) 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది.
హైదరాబాద్-కొల్లాం (07166) ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 3.55 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.15 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లాం-హైదరాబాద్ (07165) ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటలకు కొల్లాంలో బయలుదేరి 18వ తేదీ ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబ్‌బాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, చిత్తూరు, తదితర స్టేషన్‌లలో ఆగుతుంది.
కాకినాడ- హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే...
Published Tue, Sep 3 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
Advertisement
Advertisement