దసరా,దీపావళి వంటి ప్రధాన పండుగలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అక్టోబర్, నవంబర్ నెలల్లో 104 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. సికింద్రాబాద్-విజయవాడ,సికింద్రాబాద్-ముంబయి,హైదరాబాద్-షాలీమార్, సికింద్రాబాద్-గౌహతి, కాచిగూడ-మంగళూరు, తిరుపతి-ఔరంగాబాద్ తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లే న డుస్తాయని సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్-గౌహతి (18 సర్వీసులు)
సికింద్రాబాద్-గౌహతి (07149) వీక్లీ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 4,11,18,25, నవంబర్ 1.8,15,22,29 (ప్రతి శుక్రవారం) తేదీల్లో ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గౌహతి చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో గౌహతి-సికింద్రాబాద్ (07150) అక్టోబర్ 7,14,21,28,నవంబర్ 4,11,18,25 (ప్రతి సోమవారం) తేదీలలో ఉదయం 6 గంటలకు గౌహతి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.ఈ ట్రైన్ మన రాష్ర్టంలో జనగామ,కాజీపేట్, వరంగల్, మహబూబ్‌బాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ,విశాఖపట్టణం, విజయనగరం, పలాస తదితర స్టేషన్‌లలో ఆగుతుంది.
హైదరాబాద్-షాలిమార్ ( 16 సర్వీసులు )
హైదరాబాద్-షాలిమార్ (కోల్‌కత్తా) (07128) ప్రత్యేక రైలు అక్టోబర్ 6,13,20,27,నవ ంబర్ 3,10,17,24 (ఆదివారాలు) తేదీలలో రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇది రాత్రి 10.15 కు సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి రాత్రి 10.20 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమార్-హైదరాబాద్ (07127) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8,15,22,29, నవంబర్ 5,12,19,26 తేదీలలో (మంగళవారాలు) ఉదయం 11.05 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుంది.బుధవారం మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 2.30 కు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. జనగామ,కాజీపేట్,వరంగల్,ఖమ్మం,విజయవాడ,ఏలూరు,తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట,అనకాపల్లి,దువ్వాడ,విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం,పలాసతదితర స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి.
కాచిగూడ-మంగళూరు (18 సర్వీసులు)
కాచిగూడ-మంగళూరు (07606) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 1,8,15,22,29, నవంబర్ 5,12,19,26 తేదీలలో (మంగళవారాలు) కాచిగూడ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు మంగళూరు చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో మంగళూరు-కాచిగూడ (07605) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 2,9,16, 23,30, నవంబర్ 6,13,20,27 తేదీలలో (బుధవారాలు) రాత్రి 8 గంటలకు మంగళూరు నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారు జామున 3.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.జడ్చర్ల,మహబూబ్‌నగర్,గద్వాల్,కర్నూల్,డోన్,గుత్తి,ఎర్రగుంట్ల,కడప,రాజంపేట్,రేణిగుంట,తదితర స్టేషన్‌లలో ఆగుతాయి.
ఔరంగాబాద్-తిరుపతి (18 సర్వీసులు)
ఔరంగాబాద్-తిరుపతి (07405) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 4,11,18,25,నవంబర్ 1,8,15, 22,29 (శుక్రవారాలు)తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో తిరుపతి-ఔరంగాబాద్ (07406) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 5,12,19,26,నవంబర్ 2,9,16 ,23,30 (శనివారాలు) తేదీలలో రాత్రి 9.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8,30 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు,చీరాల, తెనాలి, విజయవాడ,ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్‌తదితర స్టేషన్‌లలో ఆగుతాయి.
రైలు వేళల్లో మార్పు కాచిగూడ-నిజామాబాద్
కాచిగూడ- నిజామాబాద్- కాచిగూడ ప్యాసింజర్ నంబర్లలోనూ, వేళల్లోనూ ఈ నెల 23 నుంచి మార్పులు చోటు చేసుకోనున్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్ నంబర్ 77685. కాగా 23వ తేదీ నుంచి ఇది 57685 గా మారనుంది. ఈ ట్రైన్ ఉదయం 5 గంటల కు నిజామాబాద్‌లో బయలుదేరి ఉదయం 9.25 గంటల సమయంలో కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-నిజామాబాద్ ప్యాసిం జర్ ట్రైన్ ఇప్పటి వరకు 77686 నంబర్ పై నడుస్తుండగా ఇక నుంచి 57686 గా మారనుంది.ఈ ట్రైన్ ఉదయం 9.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. అలాగే ఇప్పటి వరకు 77687 నంబర్‌పై నడుస్తున్న నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ 57687గా మారనుంది.ఇది మధ్యాహ్నం 2.15 గంటలకు నిజామాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది.కాచిగూడ -నిజామాబాద్ ప్యాసింజర్ ప్రస్తుతం 77688 నంబర్‌పై నడుస్తుండగా ఇక నుంచి ఇది 57688 నంబర్‌పై నడవనుంది.ఈ ట్రైన్ సాయంత్రం 6.55 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.45 కు నిజామాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-బీదర్
సికింద్రాబాద్-బీదర్ మధ్య రాకపోకలు సాగిం చే బీదర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేళల్లో ఈ నెల 20 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలి పారు. ఈ మేరకు సికింద్రాబాద్-బీదర్ ఎక్స్‌ప్రెస్ (17010) సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బదులు 6.30 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9.15 గం టలకు బదులు రాత్రి 10.30 గంటలకు బీదర్ చే రుకుంటుంది.బీదర్ నుంచి నాంపల్లికి వచ్చే బీ దర్-హైదరాబాద్ (17009) ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేళ ల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు.
సికింద్రాబాద్-విజయవాడ (18 సర్వీసులు)
సికింద్రాబాద్-విజయవాడ(07203) వీక్లీ స్పెషల్ అక్టోబర్ 4,11,18,25,నవంబర్ 1,8,15,22,29 తేదీల్లో (ప్రతి శుక్రవారం) రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంట లకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-సికింద్రాబాద్ (07204) వీక్లీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3,10,17, 24,31,నవంబర్ 7,14,21,28 తేదీల్లో (ప్రతి గురువారం) రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.20 గ ంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మధిర స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగుతాయి.
సికింద్రాబాద్-ముంబయి (16 సర్వీసులు)
సికింద్రాబాద్-ముంబయి లోకమాన్యతిలక్ టర్మినస్ (02701) ఏసీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 6,13,20,27,నవంబర్ 3,10,17,24 తేదీలలో (ఆదివారాలు) రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.05 గంటలకు ముంబయి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ముంబయి-సికింద్రాబాద్ (02702) ఏసీ స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 7,14,21,28, నవంబర్ 4,11,18,25 తేదీలలో (సోమవారాలు) రాత్రి 8.50 గంటలకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి.ఈ రైళ్లు మన రాష్ట్రంలో బేగంపేట్, వికారాబాద్, తాండూరు తదితర స్టేషన్‌లలో ఆగుతాయి.