ములకలచెరువు(చిత్తూరు జిల్లా) :
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోట పంచాయతీ తుమ‍్మలవారిపల్లి వద‍్ద శనివారం వేకువజామున చిరుతపులి కనిపించడంతో రైతులు భయంతో పలుగులుతీశారు. తుమ‍్మలవారిపల‍్లెకు చెందిన మస్తాన్‌వలీ, వెంకటేష్ అనే రైతులు తమ పోలాలకు నీళ‍్లు పెట‍్టేందుకు శనివారం ఉదయం 4 గంటలకు పొలాల వద‍్దకు వెళ్లారు. మోటారు ఆన్ చేసి నీటి పారుదలను గమనిస్తుండగా జింకలను తరుముకుంటూ చిరుతపులి రావడాన్ని గమనించి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఈ ప్రాంతంలో జింకలు ఎక్కువగా ఉండడంతో వాటిని వేటాడేందుకు చిరుత పులులు తరుచుగా వస్తుంటాయని ఈప్రాంత రైతులు చెబుతున్నారు. హార్సిలీ హిల్స్ సమీపంలో ఉండడంతో చిరుతలు వస్తుంటాయని అంటున్నారు. సమాచారం అందుకున‍్న అటవీ శాఖ అధికారులు తుమ‍్మలవారిపల‍్లెకు వెళుతున్నారు.
చిరుత సంచారంతో రైతుల్లో అలజడి
Published Sat, Feb 4 2017 10:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement