మున్సిపాలిటీలో ఓటమిని జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్న టీడీపీ నాయకులు
మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అక్రమ కేసుల బనాయింపు
కార్యాలయంలో సీసీ కెమెరాలు ధ్వంసం
అడుగడుగునా అభివృద్ధికి అడ్డు
పోలీసు సమక్షంలో మరోసారి రెచ్చిపోయి దౌర్జన్యం
నగరి మున్సిపాలిటీలో అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటి నుంచి టీడీపీ దౌర్జన్యకాండ ఆగడం లేదు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతిపై టీడీపీ నాయకులు రాజకీయ కక్ష పెంచుకున్నారు. టీడీపీ నియోజకవర్గ నేత కనుసన్నుల్లో రెండేళ్లుగా దాడులకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆదివారం మరోసారి కేజే శాంతి, కేజే కుమార్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దౌర్జన్యానికి దిగడం నగరిలో ఉద్రిక్తతకు దారితీసింది.
నగరి: మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అధికార దర్పంతో పేట్రేగిపోతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కనుసన్నల్లో రౌడీయిజం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదన్న ఆక్రోశంతో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజేకుమార్‌పై రాజకీయ కక్ష పెంచుకుని ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. మున్సిపాలిటీలో పాలన ముందుకు సాగకుండా అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో తాము ఏం చేసినా బయటకు తెలియకూడదని సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. తమకు అనుకూలమైన కమిషనర్లను నియమించుకుని పాలనకు అడ్డుపడుతూ చైర్‌పర్సన్‌ను వేధింపులకు గురిచేశారు. పాత ఆస్పత్రి భవనాల్లోకి బాలికల జూనియర్ కళాశాలను మార్చాలన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా విజ్ఞప్తులకు జిల్లా అధికారులు సుముఖత వ్యక్తం చేయగా, వైఎస్సార్‌సీపీకి ఎక్కడ పేరు వస్తుందోనని మున్సిపల్ కార్యాలయాన్ని పాత ఆస్పత్రి భవనాల్లోకి మారుస్తున్నట్లు చైర్‌పర్సన్‌కు తెలియకుండానే కమిషనర్‌తో టీడీపీ నియోజకవర్గ నేత ప్రకటన చేయించి వివాదాలకు తెరతీశారు. గతంలో కమిషనర్‌తో తప్పుడు కేసులు పెట్టించి కేజే కుమార్, అతని కుమారుడిని జైలు పాలు చేశారు. అరెస్టు సమయంలో పోలీసులతో హైడ్రామా సృష్టించారు. చైర్‌పర్సన్ జాకెట్ చింపి అవమానపరిచారు.
మరోసారి చైర్‌పర్సన్‌పై దాడి..
నగరిలో ఆదివారం మరోసారి చైర్‌పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్, ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. రంజాన్ సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చైర్‌పర్సన్‌ను పోలీసుల సమక్షంలోనే అవమానపరిచారు. టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు ‘ఇది టీడీపీ కార్యం..మీరెందు కు వచ్చారు’ అంటూ చైర్‌పర్సన్‌ను, ఇద్దరు కౌన్సిలర్లను నిలదీశారు. కార్యకర్తలను రెచ్చగొట్టించి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై దాడికి ఉసిగొల్పారు.
నగరిలో తమ్ముళ్ల బరితెగింపు
Published Mon, Jul 4 2016 1:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement