ప్రాణాలు తీసిన పవర్‌కట్
విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరిగి అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో సరఫరాను పునరుద్ధరించగలిగారు. అయితే, ఆ సమయంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విజయవాడ నగరానికి చెందిన ఇద్దరు రోగులు పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.
ట్రాన్స్‌ఫారమ్ నుంచి ఆస్పత్రికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన కేబుల్‌లైన్ కాలిపోవడంతోనే ఈ సమస్య ఏర్పడింది. జనరేటర్లు ఉన్నప్పటికీ కేబుల్ కాలిపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఆస్పత్రి సిబ్బంది మరో కేబుల్‌ను వేసి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. కాగా ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడిన మంత్రి ...కారణాలపై సాయంత్రంలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటన పై ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విచారణకి ఆదేశించారు.