నేడు వైఎస్సార్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం
కర్నూలు: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మెగాసిరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, పెన్షన్ల తొలగింపు, కరెంటు కోతలు, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు పరిశీలకులు, కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మునిసిపల్ చైర్మన్లు, పార్టీ అనుబంధ ప్రజా సంఘాల సభ్యులు, అధ్యక్ష, కార్యదర్శులు, మండల కన్వీనర్లు హాజరు కావాలని ఆయన కోరారు.
ప్రజా సమస్యలే ఎజెండా
Published Sun, Oct 12 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement
Advertisement