పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి | Reduce the number of cases pending | Sakshi
Sakshi News home page

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి

Published Sun, Feb 2 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి

పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి

  •     జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావు
  •       వినతిపత్రాలు సమర్పించిన న్యాయవాదులు
  •  వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలని జిల్లా పోర్టుపోలియో జడ్జి, హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావు న్యాయవాదులకు సూచించా రు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఆయన వరంగల్‌కు వచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాదులనుద్దేశించి మాట్లాడారు. పాతకేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో క్రిమినల్ కేసులు సత్వరం పరిష్కారమవుతున్నాయని వివరిం చారు. సివిల్ కేసుల పెండింగ్ పెరుగుతోందని తెలి పారు. అనవసరమైన కేసులు న్యాయస్థానాల్లో దాఖలు చేయొద్దని కక్షకిదారులకు చెప్పాలని న్యాయవాదులకు సూచించారు. కొందరి ఒత్తిడి మూలంగా న్యాయస్థానాల వెలుపల సివిల్ కేసులు సెటిల్‌మెంట్ అవుతున్నాయన్నారు.

    తద్వారా కోర్టులో విత్‌డ్రా అవుతున్నాయని, అలాకాకుండా కక్షిదారులు ఇష్టపూర్వకంగా రాజీపడే విధంగా చూడాలని పేర్కొన్నారు. జూనియర్ న్యాయవాదులు అంకితభావంతో పనిచేసి న్యాయమూర్తులు, న్యాయఅధికారులుగా ఎదగాలని కాంతారావు ఆకాం క్షించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానా లు భర్తీ చేస్తామని, ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని, వరంగల్‌కు కేటాయించిన ఏసీబీ కోర్టు విషయమై పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్‌లో ఉన్న రైల్వేకోర్టు పరిధి చాలా విస్తరించి ఉందని, సరిపడా సిబ్బంది లేరని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.వెంకటరమణ ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
     
    ఖాళీలు భర్తీ చేయాలి..
     
    జిల్లాలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల స్థానాలు, సిబ్బందిని భర్తీ చేయాలని బార్ అసోసియేషన్ ప్రతి నిధులు జడ్జి జస్టిస్ కాంతారావును కోరారు. మూడు అదనపు జిల్లా కోర్టులు, ఒక సబ్‌కోర్టు, లేబర్‌కోర్టు, కోఆపరేటివ్ ట్రిబ్యునల్‌కు న్యాయమూర్తులు లేరని, సత్వరమే నియమించాలని సూచించారు. కాజీపేట రెల్వేకోర్టులో వసతులు లేవని, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించగా, పరిష్కరిస్తానని జడ్జి హామీ ఇచ్చారు.
     
    మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలి..

    మేడారం జాతర సందర్భంగా ఫిబ్రవరి 13,14 తేదీల్లో సెలవులు ఇవ్వాలని న్యాయవాది గుడిమల్ల రవికుమార్ జస్టిస్ కాంతారావుకు విజ్ఞప్తి చేశారు. మీ వినతిపత్రాన్ని హైకోర్టుకు పంపించండి.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్‌రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు అంబరీషరావు, సునీల్ శ్రీనివాస్, నరేందర్త్న్ర, అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, రేణుక, కృష్ణయ్య, న్యాయమూర్తులు శ్రీ దేవి, శారదాదేవి, జాన్సన్, విలాసిత, నసీం సుల్తానా, ప్రమీలజైన్, సరళాకుమారి, చక్రవర్తి, రాజేంద్రరెడ్డి పా ల్గొన్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.కాంతారావును సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో రూరల్, అర్బన్ ఎస్పీలు కాళిదా సు, వెంకటేశ్వర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
     

Advertisement
Advertisement