హైదరాబాద్: కేంద్ర సర్వీసు నుంచి రిలీవ్ అయిన రాష్ట్ర ఐఏఎస్ కేడర్‌కు చెందిన సతీశ్ చంద్రను ఢిల్లీల్లోని ఆంధ్రప్రదేశ్ భవన్ రిసిడెంట్ కమిషనర్‌గాను, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సతీశ్ చంద్ర గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కార్యాలయంలో పనిచేశారు. మొన్నటి వరకు కేంద్రంలో ఎరువుల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా సతీశ్ చంద్ర పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సతీశ్ చంద్ర కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు.
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా సతీశ్ చంద్ర
Published Tue, Jul 1 2014 10:23 PM | Last Updated on Sat, Aug 18 2018 9:18 PM
Advertisement
Advertisement