కొండచిలువను మింగిన వైరినాగు | snake swallowed by python | Sakshi
Sakshi News home page

కొండచిలువను మింగిన వైరినాగు

Published Thu, Nov 2 2017 6:28 AM | Last Updated on Thu, Nov 2 2017 6:28 AM

snake swallowed by python - Sakshi

శ్రీకాకుళం,పాలకొండ రూరల్‌: కొండచిలువను మింగిన వైరినాగు గ్రామస్తుల చేతిలో హతమైంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఓని గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఓని సమీపంలోని నాగావళి ఎడమ కాలువ వద్ద 16 అడుగుల వైరినాగుపాము ఎనిమిది అడుగుల కొండచిలువను మింగేసింది. దీనిని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురై ఆ పామును కర్రలతో కొట్టి చంపారు. దీంతో పాము నోట్లో ఉన్న కొండచిలువ కూడా చనిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement