శాస్త్రోక్తంగా భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం | Srinivasa Murthy was born in Tirumala Srivir Temple on Saturday. | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం

Published Sun, Jun 25 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

శాస్త్రోక్తంగా భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం

శాస్త్రోక్తంగా భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం  భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులోభాగంగా ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల నడుమ ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు.

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన శాసనాన్ని ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన ఇప్పటికీ దర్శించవచ్చు. ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని పిలుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement