శ్రీకాకుళం: జిల్లాలోని రేగిడి మండలం ఉలుకూరు ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్లో సోమవారం రాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. చోరీ చేసేందుకు దోపిడి దొంగలు బ్యాంక్ తలుపులు పగులుగొడుతుండగా గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. దాంతో అప్రమత్తమైన దొంగలు అక్కడనుంచి పరారైనట్టు తెలిసింది.