ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి: వెంకయ్య
ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి: వెంకయ్య
Published Sun, Aug 3 2014 2:13 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్క్షప్తి చేశారు.
పట్టణాభివృద్ది కోసం లోకల్ అథారిటీలు కూడా సక్రమంగా పనిచేయాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో ఇన్సూరెన్స్ యాక్ట్ సవరణ బిల్లును త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు వెంకయ్య తెలిపారు. బీమారంగంలో 49% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తామని, ప్రతిపక్షాలు కూడా బీమా బిల్లుకు సహకరించాలని వెంకయ్య సూచించారు.
రాజకీయ రంగులను పులుముకోకుండా కేంద్ర నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు.
Advertisement
Advertisement