బాకీ డబ్బు అడిగితే చెవి కోశాడు! | Woman ear cutted by borrower | Sakshi
Sakshi News home page

బాకీ డబ్బు అడిగితే చెవి కోశాడు!

Published Tue, Dec 17 2013 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

Woman ear cutted by borrower

తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్: అప్పుగా ఇచ్చిన డబ్బు అడిగిన నేరానికి ఓ మహిళపై దాడి చేసి ఆమె చెవి కోశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో సోమవారం జరిగింది. ఇస్లావత్ తండాకు చెందిన లక్ష్మి అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ బూబులుకు ఏడాది క్రితం రూ.10 వేలు అప్పుగా ఇచ్చింది. తన బాకీ తీర్చాలని లక్ష్మి కొద్ది రోజులుగా అడుగుతుంటే బూబులు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతడి ఇంటికి వెళ్లి తన బాకీ చెల్లించాలని  తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన బూబులు అతడి తల్లి బాజి కలిసి లక్ష్మిపై దాడి చేశారు. తల్లి లక్ష్మిని పట్టుకోగా బూబులు కత్తితో ఆమె చెవి కోశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement