![YS Jagan mohan reddy fight public problem in pattikonda - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/3/jagan-1.jpg.webp?itok=fDeJXXfp)
పత్తికొండ రూరల్: ‘నా కూతురు రాధిక బిడ్డ సాయితేజశ్వినికి చిన్నతనంలోనే గుండెకు చిల్లుపడింది. లక్షలు ఖర్చు పెడితే గానీ వైద్యం చేయించలేని దయనీయ స్థితి మాది. అలాంటిది ఆరోగ్యశ్రీ మాఇంటి దీపాన్ని కాపాడింది. నాడు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించడంతో ఇప్పుడు సాయితేజశ్విని ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం డోన్‌లో 7వ తరగతి చదువుతోంది. ఆరోగ్యశ్రీ లేకపోతే మామనవరాలు బతికేది కాదు. ఎన్నిజన్మలైనా మీనాన్న చేసిన రుణం తీర్చుకోలేం’ అని తుగ్గలికి చెందిన శ్రీనివాసరెడ్డి భార్య పార్వతమ్మ వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. శనివారం ఆమె పాదయాత్రగా వస్తున్న జననేతను కలిసి మహానేత వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది. స్పందించిన జననేత ఆమెను ఓదార్చి ఈపథకానికి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పేదవారి వైద్యానికి అనేక ఆంక్షలను విధిస్తూ తూట్లు పొడుస్తోందని, మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment