సాక్షి, విశాఖపట్నం, కె కోటపాడు : వైఎస్‌ఆర్ హయాంలో వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీని నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే ఈ ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాక సహకారం రంగంలోని ఫ్యాక్టరీలు, డైరీలు మూతపడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో సోమవారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
2003 వరకు తీవ్ర నష్టాల్లో ఉన్న చక్కెర ప్యాక్టరీని వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక ఆధునీకరించి లాభాల బాటలో నడిపించారని ఆయన గుర్తుచేశారు. ‘‘ వైఎస్ హయాంలో లాభాల బాటలో ఉన్న సహకార రంగాలను 2014లో బాబు సీఎం అయ్యాక పూర్తిగా నష్టాల్లోకి తీసుకెళ్లారు. కేవలం నాలుగేళ్ల కాలంలో వేలకోట్ల నష్టాల్లోకి చక్కెర ఫ్యాక్టరీని తీసుకెళ్లారు. ఇక్కడ తయారు చేసే మోలాసిస్ కేవలం ఆరువందలకు ప్రభుత్వం కొని వారి బినామీలకు రెండు వేలకు అమ్ముకుంటున్నారు. సీఎం స్థానంలో ఉన్న బాబే అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మాడగుల నియోజకవర్గానికి ఆయుపట్టుగా ఉన్న రైవాడ రిజర్వాయర్ నీటిని విశాఖకు తరలిస్తున్నారు. దాంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీటిని విశాఖకు తరలించి.. రైవాడ రిజర్వాయర్ నీటిని పూర్తిగా ఈ ప్రాంతానికే కేటాయించవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు పూర్తి కాదు. వారి బంధువులకు, బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారు’ అని వైఎస్ జగన్ విమర్శించారు’’
హుద్‌హుద్ గాయాలు ఇప్పటికీ మానలేదు..
‘‘స్థానికంగా రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చోడవరం, కోటపాడు మధ్య రోడ్లు మరింత దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్ల మీద అక్రమంగా ఇసుక రవాణ చేసి రోడ్లను గుంతలుగా మారుస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఇసుక మాఫీయానే కాకుండా మట్టి మాఫీయా కూడా తీవ్ర స్థాయికి చేరింది. నీరుచెట్టు పథకం కింద చెరువుల్లో ఫ్రొకేన్లు పెట్టి తాటి చెట్టు లోతు తవ్వి మట్టిని దోచుకుంటున్నారు. మట్టిని కూడా వదల కుండా మాఫియా చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాడగులలో డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు భవనాలు కూడా పూర్తి కాలేదు. వైఎస్‌ఆర్ హయాంలో ఇదే నియోజవర్గంలో పేదలకు 42వేల ఇళ్లు కట్టించారు. కానీ నాలుగేళ్ల టీడీపీ పాలనలో గ్రామానికి నాలుగైదు ఇళ్లు కూడా నిర్మించలేని పరిస్థితి. ఈ ప్రాంతానికి కీలకమైన బోడ్డెరు ఆనకట్ట హూద్‌హూద్ తూఫాన్ వచ్చినప్పుడు తెగిపోయింది. కానీ దానిని ఇంతవరకు ఆధునీకరించలేదు. హుద్‌హుద్ గాయాలు ఇప్పటికీ మానలేదు. బాబు పాలనలో 108 పూర్తిగా మూతపడిపోయింది. అంబులెన్స్ అందుబాటులో అనేక మంది చనిపోయారు. పాలన గాలికొదిలేసి కేవలం అబద్దాలు చేప్పి రోజులు గడుతున్నారు ఇటీవల గుంటూరులో ముస్లింల సభ పెట్టి.. అక్కడ ప్లేకార్డులు పట్టుకున్న ముస్లిం పిల్లలను అక్రమంగా అరెస్ట్ చేశారు. వారిని చిత్రహింసలకు గురిచేశారు’’
ముస్లింలపై అక్రమ కేసులు..
‘‘వారు కేవలం మంత్రి వర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని మాత్రమే ప్లేకార్డులు పెట్టారు. దేశాన్ని విభజించాలని వారు డిమాండ్ చేస్తున్నారని.. చంద్రబాబు నాయుడు వారిపై అక్రమంగా కేసులు పెట్టించారు. గతంలో కూడా కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలును తగలపెట్టి.. వైఎస్సాసీపీపై అనేక నిందలు మోపారు. తమ పార్టీకి చెందిన అనేక మంది నేతలపై అక్రమ కేసు పెట్టారు. ఆడవారిపై, ఎస్సీలపై కూడా కేసులు పెట్టారు. ఘటన జరిగి 32 నెలలు గడిచినా కూడా ఒక్క ఆరోపణ కూడా రుజువుచేయలేకపోయారు. ఎన్నికల సమయంలో అనేక హామీలను ప్రజలకు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు, పొదుపు సంఘాల మహిళకు రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ వాటిని రద్దు చేయలేదు.
రాష్ట్రంలో మద్యం పూర్తిగా రద్దు చేస్తామన్నారు. కానీ ప్రతీ గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. లక్షానలభై వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కానీ గ్రామానికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రానికి ఏంతో కీలమైన ప్రత్యేక హోదాను కూడా తన ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారు. గతంలో జగన్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే అన్నారు. ఇప్పుడేయో.. జగన్‌కు ఓటు వేస్తే బీజేపీ ఓటు వేసినట్లే అంటున్నారు.ఆయన ఎవరితో కాపురం చేస్తే వాళ్లే మంచివాళ్లు. చంద్రబాబు పాలనలో కేవలం అవినీతి, అన్యాయం, అక్రమాలు తప్ప ఏమీ లేదు. మీ అందరి అశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తే నవరత్నాలను అమలు చేస్తాం. దాంతో ప్రతీ పేదవాడి కష్టాలు తీరుతాయి. కార్పోరేషన్లు పూర్తిగా ప్రక్షాళన చేసి కులాల వారిగా రుణాలు ఇస్తాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment