ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన | YS Vijayamma to visit flood affected areas in Krishna, Godavari districts | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన

Published Sat, Oct 26 2013 7:46 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన - Sakshi

ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం నుంచి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆదివారం కృష్ణా, సోమవారం పశ్చిమ గోదావరి, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలకు వెళతారు. బాధితులను పరామర్శించి వారి సమస్యలను వైఎస్ విజయమ్మ స్వయంగా తెలుసుకోనున్నారు.

వరద ముంపునకు గురైన శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల వైఎస్ విజయమ్మ పర్యటించిన సంగతి తెలిసిందే. బాధితులు, రైతుల కష్టాలను తెలుసుకుని, వారి ఆదుకోవాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. 29 మంది మరణించగా, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement