పార్లమెంట్‌లో ‘హోదా’ కోసం పట్టు | ysrcp parliamentary party to rise voice for ap special status | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ‘హోదా’ కోసం పట్టు

Published Mon, Jan 30 2017 6:26 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

పార్లమెంట్‌లో ‘హోదా’ కోసం పట్టు - Sakshi

పార్లమెంట్‌లో ‘హోదా’ కోసం పట్టు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం
- విభజన చట్టంలో ఉన్నవాటినే ప్యాకేజీలో ఇచ్చామని జైట్లీ చెప్పారు
- ప్యాకేజీ ఎక్కడ.. దానికి చట్టబద్ధత ఎక్కడ?
- అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత హోదా అవసరం లేదంటారా?
- ప్యాకేజీ పేరిట చంద్రబాబు దగా చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ సమావేశాల్లో గట్టిగా పట్టుబట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెం టరీ పార్టీ నిర్ణయించింది. వైఎస్సార్‌సీపీ అధ్య క్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం ఆయన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సమావేశం అభిప్రాయపడింది. పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్, బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సహచర ఎంపీలతో కలిసి మేకపాటి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసమే ప్రధానంగా పోరాడాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సూచించారని చెప్పారు.


విభజన చట్టంలోనివే ప్యాకేజీలోనూ
ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నేతలు కోరారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పదిహేనేళ్లపాటు హోదా ఇవ్వా లని డిమాండ్‌ చేయడమే కాక పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారని చెప్పారు. ఇప్పు డు ఆ అంశాన్ని తుంగలో తొక్కారని ఆరోపిం చారు. ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా లేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతు న్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతున్నా ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నా రని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యే క ప్యాకేజీకి చట్టబద్ధత సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని టీడీపీ నేతలు చెప్పడం ఉత్త డొల్లేనని మేకపాటి విమర్శించారు. అసలు విభజన చట్టంలో ఉన్నవాటినే ప్యాకేజీలో ఇచ్చామని, ఇంకా చట్టబద్ధత ఏమిటంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలుగు జర్నలిస్టులతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అది ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీగా టీడీపీ నేతలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 
మన హక్కును కాపాడుకోవాలి
రాష్ట్రంలో ప్రజలంతా ఏకమై ప్రత్యేక హోదా హక్కును కాపాడుకోవాలని మేకపాటి పిలుపు నిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధనకు ఆందోళనలు చేస్తూ ముందుకు వెళుతున్నారని చెప్పారు. హోదా సాధన పోరాటంలో భాగంగా విశాఖలో కొవ్వొ త్తుల ర్యాలీకి జగన్‌ వెళితే విమానా శ్రయంలోనే అడ్డుకుని వెనక్కి పంపించారని దుయ్యబ ట్టారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత  హోదా అవసరం లేదని చంద్రబాబు మాట్లాడు తున్నారని మండిప డ్డారు. చంద్రబాబుకు మద్దతునిచ్చే పత్రికలు వక్రీకరిస్తున్నాయి తప్ప ప్రత్యేక ప్యాకేజీలో ఏమీ లేదన్నారు. అందుకే తాము జగన్‌ సూచనల మేరకు హోదా హక్కును పరిరక్షించుకునేందుకు పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు.  


ప్యాకేజీ పేరిట మోసగిస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వెల గపల్లి వరప్రసాద్‌ విమర్శించారు. నిజంగా ప్యాకేజీ అంత గొప్పదైతే దానివల్ల ఎన్ని నిధులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? అనే విషయాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
పెట్టుబడులు, ఎంవోయూలు బోగస్‌ విశాఖ భాగస్వామ సదస్సులో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఎంఓయూలు కుదిరాయని చంద్రబాబు ప్రకటించుకోవడం బోగస్‌ అని ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేం దుకే సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.   


హోదాపై ప్రైవేట్‌ బిల్లును ఆమోదింపజేసుకుంటాం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ లోక్‌సభలో తాను ఇప్పటికే ఇచ్చి న ప్రైవేట్‌ బిల్లు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు వస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ బిల్లును ఆమోదింపజేసు కోవడం కోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు గట్టిగా కృషి చేస్తామ న్నారు. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరో ధక చట్టంలో సవరణల ఆమోదం కోసం కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై అధికార టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్న మాటలు అభ్యంతర కరంగా ఉన్నాయన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement