'స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణం' | yv subba reddy slams on tdp government | Sakshi
Sakshi News home page

'స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణం'

Published Mon, Apr 13 2015 11:43 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

'స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణం' - Sakshi

'స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణం'

హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణమని వైఎస్ఆర్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ స్మగ్లర్లకు శిక్ష వేస్తే తప్పు లేదు,  కానీ పేద కూలీలను చంపడం మానవహక్కుల ఉల్లంఘనే అన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 16 వ తేదీన వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తున్నట్టు ఆయన తెలిపారు.

వెలుగొండ ప్రాజెక్టు వద్ద రైతులతో మాట్లాడి, ప్రాజెక్టు పూర్తైయితే వచ్చే ప్రయోజనాలపై రైతులకు వివరణ ఇస్తామన్నారు. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్ ఉన్న ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బాబు సొంత మనుషుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. పట్టిసీమకయ్యే ఖర్చుతో వెలిగొండ, గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement