స్టోర్‌లోనే పేలిన ఐప్యాడ్‌ బ్యాటరీ | Apple Shuts Amsterdam Store After iPad Battery Explosion  | Sakshi
Sakshi News home page

స్టోర్‌లోనే పేలిన ఐప్యాడ్‌ బ్యాటరీ

Published Mon, Aug 20 2018 4:40 PM | Last Updated on Mon, Aug 20 2018 8:01 PM

Apple Shuts Amsterdam Store After iPad Battery Explosion  - Sakshi

పేలిన ఐప్యాడ్‌ బ్యాటరీ

శాన్‌ఫ్రాన్సిస్కో : స్మార్ట్‌ఫోన్లను, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎక్కువగా వాడటం, ఎక్కువ సేపు ఛార్జింగ్‌ పెట్టడంతో బ్యాటరీలు హీట్‌ ఎక్కి పేలడం చూస్తూ ఉన్నాం. కానీ అత్యంత సురక్షితమైన ఆపిల్‌ ఐప్యాడ్‌ బ్యాటరీ కూడా పేలిపోయింది. అది కూడా స్టోర్‌లో ఉన్న సమయంలోనే. ఐప్యాడ్‌ బ్యాటరీ పేలడంతో, ఆపిల్‌ తన ఆమ్‌స్టర్‌డ్యామ్‌ స్టోర్‌ను తాత్కాలికంగా మూసివేసింది. బ్యాటరీ పేలడంతో హానికరమైన కెమికల్స్‌ ఉత్పన్నమయ్యాయని ఆపిల్‌ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా స్టోర్‌ను మూసివేశామని, ఈ పేలుడుతో స్టోర్‌లోని ముగ్గురు ఉద్యోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆపిల్‌ తెలిపింది. 

‘హానికరమైన కెమికల్స్‌ ఎక్కువగా విడుదల కావడంతో, స్టోర్‌ను మూసివేశారు. అగ్నిమాపకదళాలు, ఆ కెమికల్స్‌ను తొలగిస్తున్నారు’ అని 9టూ5మ్యాక్‌ రిపోర్టు చేసింది. గత కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనలే జరగడంతో, ఐఫోన్‌ బ్యాటరీల రీప్లేస్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ను ఆపిల్‌ చేపట్టింది. ఐఫోన్‌ బ్యాటరీలతో థెర్మనల్‌ సంఘటనలు జరగడంతో, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌లో ఉన్న రెండు స్లోర్లను అంతకముందుకు ఆపిల్‌ ఖాళీ చేసింది. ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో నేడు జరిగిన సంఘటనలో ఉద్యోగులకు అంత పెద్ద గాయాలేమీ కాలేదని, కానీ ఉద్యోగులు స్వల్పంగా గాయ పడినట్టు రిపోర్టు వెల్లడించింది. గత వారం చైనాలో డ్రైవ్‌ చేస్తున్న కారులో ఐఫోన్‌ 6 పేలింది. వెహికిల్‌ లోపల అమర్చిన డ్యాష్‌ క్యామ్‌లో ఐఫోన్‌ 6 పేలిన వీడియో రికార్డైంది. ఈ వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement