బెంగళూర్ : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగాల్లో భారీ కోత విధించనుంది. వ్యయాలను తగ్గించుకునే పనిలో పడ్డ కాగ్నిజెంట్ వందల సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకునేందుకు సన్నద్ధమైంది. ఖర్చులకు కత్తెర వేస్తూ వృద్ధికి ఊతమిచ్చేలా కొత్త సీఈఓ బ్రైన్ హంపైర్స్ కంపెనీ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టిసారించడంతో ఉద్యోగులపై కత్తి వేలాడుతోంది.
వేతన పెంపు విషయంలోనూ కాగ్నిజెంట్ కఠినంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. మెరుగైన సామర్థ్యం కనబరచని, ఏ ప్రాజెక్ట్‌కు అలాట్ కాని సిబ్బందిని వేతన పెంపులో పక్కనపెడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఉద్యోగుల తొలగింపులో ఎనిమిదేళ్ల పైబడిన అనుభవం కలిగిన ఉద్యోగులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఖర్చు తగ్గించుకునే క్రమంలో కంపెనీ ఇప్పటికే అత్యవసరం కాని టూర్‌లను తగ్గించడంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. మరోవైపు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన ఫ్రెషర్స్‌కు ఆఫర్ లెటర్లు ఇచ్చినా వారిని విధుల్లోకి తీసుకోవడంలో విపరీత జాప్యం నెలకొంది. బెంచ్‌పై పెద్దసంఖ్యలో ఉద్యోగులు ఉన్న క్రమంలో నే ఫ్రెషర్స్ ఎంట్రీలో జాప్యం చోటుచేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment