జేఎల్‌ఆర్ ఇవోక్.. కొత్త వేరియంట్. | JLR introduces new Range Rover Evoque | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్ ఇవోక్.. కొత్త వేరియంట్.

Published Thu, Nov 19 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

జేఎల్‌ఆర్ ఇవోక్.. కొత్త వేరియంట్.

జేఎల్‌ఆర్ ఇవోక్.. కొత్త వేరియంట్.

ముంబై: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా కంపెనీ  లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యూవీ) రేంజ్ రోవర్ ఇవోక్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. భారత్‌లో అసెంబుల్ చేసిన ఈ వేరియంట్ ధరలు రూ.47.1 లక్షల నుంచి రూ.63.2 లక్షల రేంజ్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. లగ్జరీ, స్టైల్, టెక్నాలజీల కలబోతగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. ఈ కొత్త వేరియంట్‌తో ఇవోక్ జైత్రయాత్ర కొనసాగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
 
 గత ఏడాది 2,700 లగ్జరీ వాహనాలు విక్రయించామని, ఈ ఏడాది ఈ సంఖ్య 3,000కు మించుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త ఇవోక్ వేరియంట్ ను 2.2 లీటర్ల నాలుగు-సిలిండర్ల టర్బో చార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని, నాలుగు వేరియంట్లలో లభిస్తుందని తెలిపారు. ప్రత్యేకతలు..: చిన్న ఎల్‌ఈడీ ఫాగ్‌ల్యాంప్స్, కొత్త ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్-లిప్ స్పాయిలర్, ఎల్‌ఈడీ బ్రేక్ లైట్, ఇన్‌కంట్రోల్ టచ్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17 స్పీకర్ల 825 వాట్స్ మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి.
 

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement