ముంబై: క్రీడా, వ్యాపార, నటనా రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన 22 మంది యువ సాధకుల జాబితాలో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చోటు దక్కించుకుంది. భవిష్యత్ దిగ్గజాల పేరిట ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ రూపొందించిన లిస్టులో స్థానం లభించిన ఏకైక క్రీడాకారిణి సింధు మాత్రమే. అపోలో లైఫ్ ఎండీ ఉపాసన కామినేని కూడా ఈ జాబితాలో ఉన్నారు.
నికర సంపద విలువతో పాటు పలు అంశాల ప్రాతిపదికన తయారు చేసిన ఈ లిస్టులో డిస్కౌంటు బ్రోకింగ్ సంస్థ జీరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్.. నితిన్ కామత్, ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్, యస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్ ఖన్నా తదితరులకు చోటు లభించింది. ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న తొలి తరం వ్యాపారవేత్తలు, కుటుంబ వ్యాపార దిగ్గజాల వారసులు, యాక్టర్లు, క్రీడాకారులు మొదలైన వారితో దీన్ని రూపొందించినట్టు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఇది కేవలం భారత జాబితానేనని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment