స్టాక్స్‌ వ్యూ | stocks View | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Jan 30 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

stocks View

మారుతీ సుజుకీ : కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:  ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర:  రూ. 5,922   
టార్గెట్‌ ధర:      రూ. 6,640
ఎందుకంటే:  భారత కార్ల మార్కెట్లో 46 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీదే. ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్  ఆర్, సెలెరియా తదితర చిన్న కార్ల మోడళ్లతో పాటు ఎస్‌–క్రాస్, విటారా బ్రెజా తదితర అధిక ధర కార్లను కూడా విక్రయిస్తోంది. ఏడవ వేతన సంఘం సిఫారసుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఫలితంగా రెండేళ్ల పాటు ఏడాదికి 16 శాతం చొప్పున కార్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా.  80 శాతం వరకూ ప్రయాణికుల కార్ల అమ్మకాలు రుణాల ద్వారానే విక్రయమవుతున్నాయి. కాబట్టి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం స్వల్పమేనని చెప్పవచ్చు. 

అధిక ధరల కార్ల అమ్మకాల్లో కూడా మారుతీ ముందంజలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 8 లక్షల ప్రీమియమ్‌ కార్లు అమ్ముడవగా,  వీటిల్లో మారుతీ సుజుకీ వాటా 25 శాతంగా ఉంది. రెండేళ్ల క్రితం ఈ వాటా 6 శాతంగానే ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రెండేళ్లలో అమ్మకాలు 12 శాతం, ఆదాయం 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. డీలర్లకు/ప్రయాణికులకు ఇచ్చే డిస్కౌంట్లు తగ్గుతుండడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం కల్లా అందుబాటులోకి వచ్చే గుజరాత్‌ ప్లాంట్‌ కారణంగా రవాణా వ్యయాలు తగ్గే అవకాశాలుండడం, విభిన్న రకాలైన మోడళ్లనందించడం తదితర కారణాల వల్ల రానున్న రెండేళ్లలో మార్జిన్లు 16 శాతం ఉండగలవని అంచనా వేస్తున్నాం.  మాతృ కంపెనీ జపాన్ కు చెందిన సుజుకీ అంతర్జాతీయ లాభాల్లో 25 శాతం వాటా ఈ కంపెనీదే. ఆఫ్రికా తదితర దేశాల్లో ఎగుమతుల కోసం లో–కాస్ట్‌ బ్రాండ్‌గా మారుతీని అభివృద్ధి చేయాలని సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ : కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మెతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ. 1,292      
టార్గెట్‌ దర: రూ. 1,510
ఎందుకంటే: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం చూపింది. 10 క్వార్టర్ల పాటు 20 శాతం వృద్ది చెందుతున్న నికర లాభం పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఈ క్యూ3లో 15 శాతానికి పడిపోయింది. నికర వడ్డీ మార్జిన్ లు 4.1 శాతంగా ఉండడం కొంచెం మెరుగైన విషయం. డీమోనిటైజేషన్  కారణంగా రుణ వృద్ధి 13 శాతంగానే నమోదైంది. ట్రేడింగ్‌ లాభాలు 22 శాతం(క్వార్టర్‌ ఆన్  క్వార్టర్‌ ప్రాతిపదికన 41 శాతం) వృద్ది చెంది రూ.390 కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత స్థిరంగా ఉంది. స్థూల మొండి బకాయిలు 1 శాతం, నికర మొండి బకాయిలు 0.32 శాతంగా ఉన్నాయి.  కాసా నిష్పత్తి క్వార్టర్‌ ఆన్  క్వార్టర్‌ ప్రాతిపదికన 500 బేసిస్‌ పాయింట్లు పెరిగి 45 శాతానికి ఎగసింది. కాసా డిపాజిట్ల జోరు కారణంగా నిధుల వ్యయం 13 బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందని భావిస్తున్నాం.

రుణ వృద్ధి పటిష్టంగా ఉండడం,,, బ్యాంక్‌ మార్కెట్‌ షేర్‌ పెరుగుతుందనడానికి సూచికగా భావిస్తున్నాం. కాసా నిష్పత్తి అధికంగా ఉండడం, వడ్డీరేట్లు తగ్గుతుండడం, మొత్తం రుణాల్లో స్థిర వడ్డీరేటు రిటైల్‌ రుణాలు 70 శాతంగా ఉండడం,  తదితర కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ లు 4.1 శాతం కంటే అధికంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. కాసా నిష్పత్తి 42 శాతానికి మించి ఉండడం,  వృద్ధి అంచనాలు పరిశ్రమ కంటే 1.3 రెట్లు అధికంగా ఉండడం, రుణ నాణ్యత రిస్క్‌ కనిష్టంగా ఉండడం, టైర్‌ వన్  క్యాపిటల్‌ 13.8 శాతంగా ఉండడం,   నిర్వహణ పనితీరు మెరుగుపడడం, బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కారణంగా ఆదాయం జోరు పెరిగే అంచనాలు,. ఇవన్నీ బ్యాంక్‌కు  కలసివచ్చే అంశాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement