సాక్షి, న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి అన్ని విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. సంస్థ నికర లాభం 23 శాతం వృద్ధితో రూ 7340 కోట్లుగా నమోదైంది. రాబడి 15 శాతం పెరిగి రూ 34,261 కోట్లకు చేరింది. బ్యాంకింగ్, ఆర్థికసేవల నుంచి రాబడి 4.1 శాతం పెరిగింది.
ఈ త్రైమాసికం చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,00,875కు చేరకుంది. ఈ క్వార్టర్‌లో కంపెనీ మెరుగైన పనితీరును కనబరిచిందని, పలు ఒప్పందాలు అమలు కానుండటం, పెరిగిన డిజిటల్ డిమాండ్‌తో భవిష్యత్‌లో మరింత వృద్ధిని సాధిస్తామని సీఈఓ రాజేష్ గోపీనాధన్ పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు వెచ్చిస్తుండటంతో క్లెయింట్లు తమ పట్ల విశ్వాసం కనబరుస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment