సాక్షి, ముంబై: దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫలితాల్లో అంచనాలను బీట్ చేసింది. మంగళవారం మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో నికర లాభాలు రూ. 8,131 కోట్లు, ఆదాయం రూ. 38,172 కోట్లను వెల్లడించింది. ఎబిటా మార్జిన్లు రూ. 9,220 కోట్లుగా నమోదయ్యాయి. అయితే డాలర్ ఆదాయంలో బలహీనపడింది.
గత క్వార్టర్‌లో 8126 కోట్ల రూపాయల నికర లాభాలతో పోలిస్తే ఈ క్వార్టర్‌లో నికర లాభాలు పుంజుకోగా వార్షిక ప్రాతిపదికన 10.8 శాతం ఎగిసాయి. ఆదాయం 11.4శాతం వృద్ధి చెందింది. ముంబైలో మంగళవారం ముగిసిన బోర్డు మీటింగ్‌లో రూ.5 ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించేందుకు ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్, క్యూ1) టీసీఎస్ బోణీ చేసింది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలు ఈ నెల 12న, విప్రో ఫలితాలు17వ తేదీన వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment