న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రతిపాదించిన మెగా బైబ్యాక్ ఆఫర్ మే 18 నుంచి ప్రారంభం కానుంది. గత నెలలోనే షేర్‌హోల్డర్ల ఆమోదం పొందిన ఈ రూ. 16,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్ మే 31న ముగుస్తుంది. అర్హులైన షేర్‌హోల్డర్లకు బైబ్యాక్ లెటర్ ఆఫ్ ఆఫర్‌ను మే 16కల్లా పంపనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజ్‌లకు సోమవారం తెలిపింది. షేరుకు రూ. 2,850 ధర చెల్లించి, మొత్తం చెల్లింపు మూలధనంలో 2.5 శాతం షేర్లను టీసీఎస్ తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ బైబ్యాక్ ఆఫర్ విజయవంతమైతే ఇండియాలో ఇదే అతిపెద్ద బైబ్యాక్ అవుతుంది. 2012లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహించిన రూ. 10,500 కోట్ల బైబ్యాక్ ఇప్పటివరకూ పెద్దది.