రైలును ఢీకొన్న ట్రక్కు.. రైలు డ్రైవర్‌ మృతి Train hits Truck, Co-pilot Dies | Sakshi
Sakshi News home page

రైలును ఢీకొన్న ట్రక్కు.. రైలు డ్రైవర్‌ మృతి

Published Sun, Oct 8 2017 6:44 PM

Train hits Truck, Co-pilot Dies

పంజాబ్ ‌: రైలును ట్రక్కును ఢీ కొట్టిన ఘటనలో రైలు డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం ఫెరోజ్‌పూర్‌లోని జలాలాబాద్‌, లాధుకా మండి స్టేషన్ల మధ్య  ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్‌ను వికాస్‌ కుమార్‌గా రైల్వే అధికారులు గుర్తించారు. వికాస్‌ డెము ప్యాసింజర్‌ రైలుకు లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

వేగంగా వెళ్తున్న రైలుకు క్రాసింగ్‌ వద్ద ట్రక్కు అడ్డొచ్చినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేసినా రైలు సమయానికి ఆగలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement