భక్తులకు మెరుగైన సేవలు | Better services for Tourists | Sakshi
Sakshi News home page

భక్తులకు మెరుగైన సేవలు

Published Sat, Aug 6 2016 8:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

Better services for Tourists

కమిషనర్‌ నాగలక్ష్మి
 
నెహ్రూనగర్‌: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం పుష్కర్‌నగర్, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె తనిఖీ చేశారు. భక్తులకు రాత్రి బస షెడ్, మరుగుదొడ్లు, స్టాల్స్, మంచినీటి సరఫరా, క్లాక్‌ రూం వంటి ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండకూడదన్నారు. స్టాల్స్‌లో భక్తులకు కావాల్సిన అన్ని వస్తువులు ఉండేలా చూడాలని సూచించారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేసే సమయంలో వేస్ట్‌ వాటర్‌ బెయిల్‌ అవుట్‌ అయ్యే విధంగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఆనంతరం పలకలూరు రోడ్డులో రోడ్డు విస్తరణ పనులు తనిఖీ చేశారు. ఆమె వెంట ఎస్‌ఈ గోపాలకృష్ణారెడ్డి, ఈఈ లక్ష్మయ్య, డిఈ వేణుగోపాల్, ఏఈలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement