ఆటో ఢీకొని బాలుడి దుర్మరణం
Published Sun, Dec 4 2016 12:09 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
నంద్యాల: ఆటో ఢీకొని బాలుడి దుర్మరణం చెందిన ఘటన వెంకటేశ్వరపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలో పెద్ద ఓబులేసు బొమ్మలసత్రంలో బైక్‌లకు ఉపయోగించే బ్యాగ్‌లను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సాయి (2) ఉదయమే నిద్రలేవగానే ఇంటి ముందర ఉన్న రోడ్డుపై ఆడుకుంటున్నాడు. అయ్యప్ప మినరల్ వాటర్ ప్లాంట్‌కు చెందిన ఆటో ప్రమాదవశాత్తు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక శాంతిరాం జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement