గురుకుల పాఠశాలలో డీఎస్పీ విచారణ
గురుకుల పాఠశాలలో డీఎస్పీ విచారణ
Published Wed, Dec 7 2016 11:37 PM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
- పోలీసుల అదుపులో నిందితుడు
ఆళ్లగడ్డ: పడకండ్ల సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి..బుధవారం విచారణ చేపట్టారు. ఈ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థినికి ఐదు నెలల గర్భం రావడం.. ఈ వార్త సంచలనం కావడంతో డీఎస్పీ స్పందించారు. విద్యార్థిని ఎప్పుడెప్పుడు సెలవు పెట్టారు..ఆమె కోసం ఎవరెవరు వచ్చేవారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని..నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. డీఎస్పీ వెంట సీఐలు దస్తగిరిబాబు, ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
ఇదిలా ఉండగా.. విద్యార్థిని గర్భానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పడకండ్ల గ్రామానికి చెందిన యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అహోబిలంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వీరిద్దరి మధ్య మాటమాట కలిసి ప్రేమగా మారినట్లు..పెళ్లి చేసుకుంటానని నిందితుడు నమ్మించినట్లు సమాచారం. గర్భం పోయేలా మాత్రలు వేసుకోమని సలహా ఇచ్చినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చెప్పినట్లు తెలిసింది. అమ్మాయి, కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారం.
Advertisement
Advertisement