మహిళకు వేధింపులు.. 'ఉత్తమ పోలీస్‌' పై వేటు | DSP suspension due to sexual allegations | Sakshi
Sakshi News home page

మహిళకు వేధింపులు.. 'ఉత్తమ పోలీస్‌' పై వేటు

Published Sat, Jan 30 2016 11:00 PM | Last Updated on Fri, May 25 2018 5:59 PM

మహిళకు వేధింపులు.. 'ఉత్తమ పోలీస్‌' పై వేటు - Sakshi

మహిళకు వేధింపులు.. 'ఉత్తమ పోలీస్‌' పై వేటు

వికారాబాద్(రంగారెడ్డి జిల్లా): మహిళా హోంగార్డును లైంగికంగా వేధించిన ఓ డీఎస్పీపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన ఓ హోంగార్డు గతంలో మృతిచెందాడు. హోంగార్డు చనిపోగా, ఆయన భార్యకు ఉపాధి కల్పిస్తూ హోంగార్డు ఉద్యోగం ఇచ్చి అప్పటి ఎస్పీ రాజకుమారి విధుల్లో నియమించారు.

కొంతకాలం వరకు ఎస్పీ కార్యాలయంలో పనిచేసిన ఆ మహిళా హోంగార్డు రెండు నెలల క్రితం పరిగి ఠాణాకు బదిలీ అయ్యారు. అయితే, తనను వికారాబాద్ ఏఆర్ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదికను డీజీపీ కార్యాలయానికి అందచేశారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గతంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ పోలీస్‌గా అవార్డు తీసుకోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement