కరీంనగర్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామానికి చెంది న ఏనుగు రవీందర్‌రెడ్డిని ని యమిస్తూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం జిల్లా పరిధిలోని వీణ వంక మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రా ష్ట్ర టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి విభా గం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించగా.. రెండు రోజుల క్రితం గంగాధర మండలానికి చెందిన సుంకె రవిశంకర్‌కు టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. తాజాగా ఏనుగు రవీందర్‌రెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించడంతో ఉద్యమకారులకు తగిన గుర్తింపునిచ్చారని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రవీందర్‌రెడ్డి ప్రాథమిక విద్యను గోపాల్‌రావుపేటలో, ఇంటర్మీడియట్, డిగ్రీ కరీంనగర్‌లో పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఎస్‌జేఏసీ జిల్లా చైర్మన్‌గా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థి ఉద్యమాలను ఉవ్వెత్తున ఎగిసిపడేలా తనవంతు పాత్ర పోషించారు. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన రవీందర్‌రెడ్డిపై 29 కేసులు కూడా నమోదయ్యాయి. సాగరహారం, మిలియన్‌మార్చ్, రెడ్డిగర్జన వంటి కార్యక్రమాల్లో పోలీసుల కళ్లు కప్పి ఉద్యమాలు చేశారు. రవీందర్‌రెడ్డి నియామకంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారందరికీ సముచిత ప్రాధాన్యం దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతికి నిరాశేనా?
టీఎస్‌జేఏసీలో పనిచేస్తూ ఉద్యమాన్ని ముం దుండి నడిపించిన విధ్యార్థి నాయకులైన సిద్ధం వేణు ఇల్లంతకుంట జెడ్పీటీసీ కాగా.. భూక్య తిరుపతినాయక్ ప్రణాళికా బోర్డు మెంబర్‌గా నియామకమయ్యారు. జిల్లా చైర్మన్‌గా పనిచేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి తాజాగా జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. వారితో పాటు కీలకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి చెందిన వారి చేతుల్లో దాడికి గు రై.. తలకు గాయాలై.. 30 కేసుల వరకు నమోదైన కెమసారం తిరుపతికి పదవి దక్కకపోవడంపై పలువురిని విస్మయానికి గురిచేసింది.
సీఎంకు కృతజ్ఞతలు
ఉద్యమకారులకు అరుదైన గౌరవం దక్కేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయి. పైరవీలకు, పలుకుబడులకు తావివ్వకుండా ఉద్యమ సమయంలో ముందుండి పనిచేసిన సామాన్యులందరికీ చట్టసభల టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా నామినేటెడ్ పదవుల్లో నియమిస్తున్నారు. సామాన్యులను భుజం తట్టి నడిపిస్తున్న ముఖ్యమంత్రి తీరు అభినందనీయం. నన్ను గుర్తించి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి న్యాయం చేస్తూ బంగారు తెలంగాణలో భాగస్వాముడినవుతా.
– ఏనుగు రవీందర్‌రెడ్డి