బాల్యవివాహాలు వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు
శ్రమించి చదివితే ఉజ్వల భవిష్యత్
Published Sun, Aug 21 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
ఎచ్చెర్ల: శ్రమించి చదివితే బాలికలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు జి.అప్పారావు. ఎం.పట్టాభి అన్నారు. డి.మత్స్యలేశంలోని బాలికల వసతి గృహంలో బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. చిన్నవయసులో పెళ్లిళ్లును తిరస్కరించాలని సూచించారు. విద్యార్థి దశలో చదువుపై మక్కువ చూపాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిరోధానికి ప్రతి ఒక్కురూ పాటుపడాలన్నారు.
Advertisement
Advertisement