‘మాలల ద్రోహి వెంకయ్యనాయుడు | mala"s anymi venkaiah naidu | Sakshi
Sakshi News home page

‘మాలల ద్రోహి వెంకయ్యనాయుడు

Published Thu, Aug 11 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

mala"s anymi venkaiah naidu

కరీంనగర్‌: ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ మాల మాదిగల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాలల ద్రోహి అని తెలంగాణ మాలమహానాడు మహిళా విభాగం జిల్లాఅధ్యక్షురాలు తీట్ల ఈశ్వరి అన్నారు. గురువారం తెలంగాణ కూడలిలో వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాల మాదిగల మధ్య కలహాలు సృష్టించేందుకు రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు మనువాద బీజేపీ ఆడుతున్న నాటకమే ఎస్సీ వర్గీకరణ అని ఆరోపించారు. వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు గతంలో తేల్చిచెప్పినా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతామని వెంకయ్యనాయుడు చెప్పడం సరికాదన్నారు. ఐక్యంగా 25 శాతానికి ఎస్సీ రిజర్వేషన్ల పెరుగుదల కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆస విజయ, బండ అనిత, శీలం పుష్పలత, మేడి అంజయ్య, బెత్తంపు దిలీప్, గోపాల భూషణ్‌రావు, దామెర సత్యం, దండి రవీందర్, ఇరుకుల యాదగిరి, వేముల రమేశ్, నాయిని ప్రసాద్, కాటుకం రాజమౌళి, బొమ్మెల్ల అనిల్, గడ్డం ప్రభాకర్, నల్లల కనుకరాజు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement