- అధికారుల ఆదేశాల మేరకు కొనసాగిన ప్రజావేదిక
- బహిష్కరణకు పింఛన్ల తొలగింపే కారణం..!
ప్రజావేదికను బహిష్కరించిన ప్రజాప్రతినిధులు
Published Wed, Sep 21 2016 12:15 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
ముథోల్ : మండల కేంద్రంలోని స్థానిక మండలపరిషత్తు కార్యాలయ సమావేశం మందిరంలో మంగళవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని ముథోల్ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్తులు బహిష్కరించారు. ఉదయం 11 గంటలకు ప్రారం¿¶ ంకావాల్సి ఉండగా ఒంటి గంటకు ప్రారంభించారు. ప్రజావేదిక కార్యక్రమానికి జిల్లా అడిషనల్ పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ శ్రీనివాస్‌లు, ఎంపీడీవో నూర్ మహ్మద్, ఎస్‌ఆర్ ప్రభు కొనసాగించారు.
అర్హుల పింఛన్ల తొలగింపే...
మొదటగా మండలంలోని విఠోలి గ్రామం, ముథోల్ గ్రామపంచాయతీలు 2015–16 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల వివరాలను సామాజిక తనిఖీ బందం ఎదుట ప్రజావేదికలో సిబ్బంది విన్నవించారు. కార్యక్రమానికి హాజరైన ముథోల్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామస్తులు జోక్యం చేసుకొని 2015 సంవత్సరంలో సామాజిక తనిఖీ బందం తనిఖీలు చేసి అర్హులైన వారి పింఛన్లను రద్దు చేసినట్లు పీడీ దష్టికి తీసుకెళ్లారు.
గతంలో సామాజిక తనిఖీ బందం తనిఖీలు చేపట్టి మండల కేంద్రంతో పాటు 20 గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాలలో అర్హులైన వారి పింఛన్లను రద్దు చేసినట్లు ఆరోపణలున్నాయి. తిరిగి గ్రామాల వారీగా ప్రత్యేక బందం వెళ్లి పింఛన్ లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సేకరించి సామాజిక తనిఖీల్లో వెల్లడించేంత వరకు ప్రజావేదికను బహిష్కరిస్తున్నాం అని ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు.
అధికారుల ఆదేశాలతో..
జిల్లా స్థాయి అధికారులు ప్రజావేదిన బుధవారం రోజున పూర్తి వ్యవహారాలతో కొనసాగించాలని అధికారులకు విన్నవించారు. మంగళవారం మాత్రం అధికారులు మాత్రం ఫీల్ట్ అసిస్టెంట్‌లు, సామాజిక బందంతో ప్రజావేదికను కొనసాగించారు. పై అధికారుల ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తో ందని ఎంపీడీవో తెలిపారు. ఈ సామాజిక తనిఖీ అర్ధరాత్రి వరకు, బుధవారం కూడా కొనసాగనుంది.
జరిగింది ఇదే..
సామాజిక తనిఖీ కొనసాగుతుండగా సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లను బయటికి పంపించి ఈ కార్యక్రమం కొనసాగించవద్దని అ«ధికారులకు తెలిపారు. ఏపీడీ జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తరువాత ఈ సామాజిక తనిఖీ బుధవారం కొనసాగించనున్నట్లు ప్రజాప్రతినిధులకు తెలపడంతో వారు వెళ్లిపోయారు. కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభకాన్నుట్లు ఎంపీడీవో నూర్ మహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్లు, సామాజిక తనిఖీ బందం తదితరులున్నారు.
Advertisement
Advertisement