ఎంసెట్‌ లీక్‌లో మంత్రుల హస్తం | Minister's involvement in the leak of eamcet | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ లీక్‌లో మంత్రుల హస్తం

Published Tue, Aug 23 2016 8:16 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

Minister's involvement in the leak of eamcet

  • ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ అనిల్‌రెడ్డి
  • జహీరాబాద్‌ టౌన్‌: ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌లో రాష్ర్ట మంత్రుల హస్తం ఉందని, వారిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ యెన్నం అనిల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో మంగళవారం నగర మహాసభను నిర్వహించారు. అనిల్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, కన్వీనర్‌ రమణరావు కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయన్నారు. ఫలితంగా పేద విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. వీరిని తొలగించిన తరువాతే ఎంసెట్‌-3  నిర్వహించాలన్నారు. సమావేశంలో బాగ్‌ కన్వీనర్‌ ఆనందీశ్వర్‌, నాయకులు విజయ్‌రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement