నెల్లూరు : దేశంలో విద్యావిధానాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేలా విద్యా విధానం ఉండాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలసి పాల్గొన్నారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ... దేశంలో గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. ఏపీ విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు తీసుకోస్తామని గోయల్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.