ట్రాన్స్‌‘ఫార్మర్‌ కష్టాలు’ | transfarmer problems | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌‘ఫార్మర్‌ కష్టాలు’

Published Tue, Aug 22 2017 10:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

ట్రాన్స్‌‘ఫార్మర్‌ కష్టాలు’ - Sakshi

ట్రాన్స్‌‘ఫార్మర్‌ కష్టాలు’

రూ.6 కోట్ల పనుల్లో అలసత్వం
పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు
పాతిన కొద్దిరోజులకే నెలకొరుగుతున్న విద్యుత్‌ స్తంభాలు


రూ.65 వేలు
16కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించేందుకు చేసిన ఖర్చు

 
రూ.55 వేలు
25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించేందుకు చేసిన ఖర్చు


రూ.5.9 కోట్లు
మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు బిగించేందుకు వెచ్చించిన మొత్తం


రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రవేశపెట్టిన హైఓల్టేజ్‌ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టం (హెచ్‌వీడీఎస్‌) పథకం పనులు అధ్వానంగా సాగాయి. రైతులు ఉపయోగించే మోటర్ల సామర్థ్యాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ మేరకు ట్రాన్స్‌ఫార్మర్‌లు బిగించినా...నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదు. ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించే పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా పాతిన నెలలోపే విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు తెగిపోయాయి... చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు షాక్‌ కొడుతున్నాయి. దీంతో స్విచ్‌ వేయాలంటేనే రైతులు భయపడుతున్నారు
- యల్లనూరు:

హైఓల్టేజ్‌ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టం (హెచ్‌వీడీఎస్‌) పథకానికి యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి, కొత్తపల్లి గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోని విద్యుత్‌ ఉపకేంద్రాల కింద ఉన్న మోటార్ల కోసం మొత్తం 910 ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. టెండరు దక్కించుకున్న ఓ ప్రముఖ సంస్థ సామగ్రి సరఫరా చేసి ట్రాన్స్‌ఫార్మర్లు బిగించడం...కొత్తగా హైఓల్టేజీ లైన్లు వేసే పనులను సబ్‌కాంట్రాక్ట్‌ ఇచ్చింది.

తూతూమంత్రంగా పనులు
సబ్‌కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ సిబ్బంది కొత్తగా 11 కేవీ లైన్లకు కోసం విద్యుత్‌ స్తంభాలు పాతారు. అయితే గుంతతీసి కంకర కాకుండా మట్టివేసి పూడ్చడంతో స్తంభాలన్నీ నేలకు ఒరిగాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చిన స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం వేసే న్యూట్రల్‌ పైప్‌ను (కడ్డీని)ఒకే గుంతలో పూడ్చారు. దీంతో న్యూట్రల్‌ పనిచేయడం లేదు. ఇక న్యూట్రల్‌ పైప్‌కు జాయింట్‌గా వేసిన కడ్డీలు నాసిరకంగా ఉండటంతో వేసిన కొద్ది రోజులకే అవి తుప్పు పట్టి విరిగిపోయాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ఫార్మర్లకు కనెక్షన్లు కూడా సరిగా ఇవ్వలేదు. దీంతో లైన్లన్నీ ట్రిప్‌ అవుతున్నాయి. దీంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడి మోటార్లు ఆడక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పైగా 11 కేవీ లైన్లుకు మరమ్మత్తులు చేసుకోవడానికి వీలుగా అక్కడక్కడ 112 ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేసినా వాటికి న్యూట్రల్‌ కనెక్షన్లను ఇవ్వలేదు. ఇలా పనులన్నీ తూతూ మంత్రంగా జరిగినా విద్యుత్‌ అధికారులు కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గ్రామం పేరు        సామర్థ్యం    ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య
దంతలపల్లి           16 కేవీ        90
                        25 కేవీ        118
బుక్కాపురం         16 కేవీ        45
                        25 కేవీ        66
తిమ్మంపల్లి          16 కేవీ        90
                        25 కేవీ        96
కల్లూరు              16 కేవీ         47
                       25 కేవీ         134
నీర్జాంపల్లి           16 కేవీ         20
                      25 కేవీ          25
కొత్తపల్లి            16 కేవీ          65
                     25 కేవీ          114
మొత్తం            --                910    

సమస్య మా దృష్టికి రాలేదు
కొత్తగా వేసిన లైన్ల వల్ల సమస్యలు ఉన్నాయని ఇంతవరకూ ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదు. ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరిస్తాం.
- రంగస్వామి, విద్యుత్‌ శాఖ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement