వెటరన్‌ క్రికెట్‌ విజేత ఆర్డీటీ | veteran cricket winner rdt team | Sakshi
Sakshi News home page

వెటరన్‌ క్రికెట్‌ విజేత ఆర్డీటీ

Published Fri, Jan 27 2017 1:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వెటరన్‌ క్రికెట్‌ విజేత ఆర్డీటీ - Sakshi

వెటరన్‌ క్రికెట్‌ విజేత ఆర్డీటీ

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : వెటరన్‌ క్రికెట్‌ విజేతగా ఆర్డీటీ జట్టు నిలిచింది. గురువారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన వెటరన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆర్డీటీ వెటరన్స్, హైదరాబాద్‌ వెటరన్‌ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్డీటీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జట్టులో షాబుద్దీన్‌ (43), రవికాంత్‌ (29), మాంచో ఫెర్రర్‌ (2 సిక్సర్లతో 25), యుగంధర్‌ (14) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో స్వరూప్‌ 2, వినోద్‌ 1, గోవింద్‌ 1 వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 19.1 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. ఆర్డీటీ బౌలర్లు కుమార్‌ 4, హరినాథ్‌రెడ్డి 2, ఇనాయతుల్లా 1, యుగంధర్‌ 1, ప్రదీప్‌ 1 వికెట్‌ తీ«శారు.

నేటి నుంచి ఫాదర్‌ ఫెర్రర్‌ వెటరన్‌ క్రికెట్‌ టోర్నీ
ప్రతి ఏటా ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆరు జట్లతో లీగ్‌ పద్ధతిలో వెటరన్‌ క్రికెట్‌ టోర్నీ అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తామని టోర్నీ ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మెన్‌ నాగప్ప తెలిపారు. ఈ టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. టోర్నీలో కడప, విజయవాడ, గుంటూరు, అనంతపురం, హైదరాబాద్‌ నుంచి 2 జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఉదయం విజయవాడ, హైదరాబాద్‌ (ఏ) జట్లు, మధ్యాహ్నం అనంతపురం, హైదరాబాద్‌ (బీ) జట్లు తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement