వైభవంగా అహోరాత్ర యజ్ఞం
మార్టేరు (పెనుమంట్ర): ఓం సాయి శ్రీ సాయి స్మరణలు మార్మోగాయి. మార్టేరు, వెలగలేరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మార్టేరులోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆల యంలో మూడు రోజుల పాటు జరుగనున్న అహోరాత్ర యజ్ఞ పూజలు సోమవారం వేకువజామున మొదలయ్యాయి. ఉదయం ఆలయ ధర్మకర్త తమనంపూడి శ్రీనివాసరెడ్డి, దంపతులతో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తిశ్రద్ధలతో సాయిదీక్ష ఆలయానికి సమీపంలో నిర్మించిన ప్రత్యేక యాగశాల వద్ద పలువురు సాయి వ్రత దీక్షలు తీసుకున్నారు. పండిత శ్రీని వాసుల విజయాగోపాలాచార్యుల నేతృత్వంలో జరిపించారు. అనంతరం యాగశాల ప్రవేశం, కలశస్థాపన, చతుర్వేద పారాయణ పూజలు జరిగాయి. మార్టేరు పంచగ్రామాలకు చెందిన సుమారు 100 మంది దంపతులు మూడు రోజుల సా యిదీక్షలో పాల్గొంటున్నారు. సాయికోటి నామావళి ఊరేగింపు అహోరాత్ర యజ్ఞం సందర్భంగా 41 రోజుల పాటు సాయి భక్తులు లిఖించిన సాయికోటి నామాల పుస్తకాలను ప్రదర్శనగా ఊరేగించారు. వెలగలేరులోని శివాలయం నుంచి మార్టేరు బాబా ఆలయం వరకు ఊరేగింపు ఉత్సవం జరిగింది. చిన్నారులు శ్రీకృష్ణ, గోపిక వేషధారణలతో ఆకట్టుకున్నారు. అత్తిలి, మార్టేరు గ్రామాలకు చెందిన శ్రీ వెంకట శివకార్తికేయ, శ్రీషణ్ముఖ శివమాధవ భజన కోలాట బృందాలు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది భక్తులు సాయి స్మరణలతో ఉత్సవంలో పాల్గొన్నారు.