ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ | Engineering Services Examination | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

Published Tue, Oct 4 2016 4:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

 ఇండియన్ రైల్వే సర్వీసెస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్)నిర్వహిస్తోంది. తాజాగా ఐఈఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి పరీక్షా విధానం,సిలబస్‌లో మార్పులు జరిగాయి. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 440పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష విధానం, అర్హతలు తదితరాలపై ఫోకస్..
 
 విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్.అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 2017, జనవరి 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (1987 జనవరి 2 - 1996 జనవరి 1 మధ్యలో జన్మించి ఉండాలి). గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు వారి సర్వీసులకు అనుగుణంగా నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.ఎంపిక విధానం: స్టేజ్-1 (ప్రిలిమినరీ పరీక్ష), స్టేజ్-2 (మెయిన్స్), పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. స్టేజ్ -1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో; స్టేజ్ -2 పరీక్ష కన్వెన్షనల్ విధానంలో ఉంటుంది.
 
 తుది జాబితా రూపకల్పన: స్టేజ్-1లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులనే స్టేజ్-2లో ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్లకు అనుమతిస్తారు. మొత్తం ఖాళీల సంఖ్యకు ఆరు నుంచి ఏడు రెట్ల మంది అభ్యర్థులను స్టేజ్ -2కు పిలుస్తారు. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియలో చివరిదైన పర్సనాలిటీ టెస్ట్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు స్టేజ్-1, స్టేజ్-2లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసు కుంటారు. పర్సనాలిటీ టెస్ట్ కూడా ముగిశాక అర్హత పరీక్షగా పేర్కొన్న స్టేజ్-1, స్టేజ్-2, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు. దీని ప్రకారం మొత్తం 1300 మార్కులకుగాను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
 
 స్టేజ్-1
 జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్: ఈ పేపర్ అన్ని బ్రాంచ్‌ల అభ్యర్థులకు కామన్‌గా ఉంటుంది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక డెవలప్‌మెంట్ అంశాలకు సంబంధించిన వర్తమాన అంశాలు, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ,  ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, న్యూమరికల్ అనాలసిస్; డిజైన్, డ్రాయింగ్‌కు సంబంధించిన జనరల్ ప్రిన్సిపల్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ తదితర అంశాలు ఉన్నాయి.
 
 ఇంజనీరింగ్ సబ్జెక్ట్: ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లోని ప్రశ్నలు.. ఆయా బ్రాంచ్‌ల వారీగా బీఈ/బీటెక్ స్థాయిలో ఉంటాయి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సిలబస్ స్టేజ్-1, స్టేజ్-2లో కామన్‌గా ఉంటుంది. స్టేజ్-2 (మెయిన్స్)లో ఉన్న రెండు పేపర్ల సిలబస్ స్టేజ్ -1 (ప్రిలిమినరీ)లోనే ఉంటుంది కానీ, మెయిన్స్‌లో మాత్రం సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు.
 
 సివిల్ ఇంజనీరింగ్ సిలబస్: పేపర్ 1: బిల్డింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మేసోన్రీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టీస్ ప్లానింగ్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు.  
 
 పేపర్ 2: ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓపెన్ చానల్ ఫ్లో, పైప్ ఫ్లో, హైడ్రాలిక్ మెకానిక్స్ అండ్ హైడ్రోపవర్, హైడ్రాలజీ, వాటర్ రీసోర్స్ ఇంజనీరింగ్; ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్), ఎయిర్, నాయిస్ పొల్యూషన్ అండ్ ఎకాలజీ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
 
 మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్: పేపర్ 1: ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఐసీ ఇంజన్స్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, టర్బో మెషినరీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ సబ్జెక్టులు ఉన్నాయి.
 పేపర్ 2: ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెకానిజమ్స్ అండ్ మెషీన్స్, డిజైన్ ఆఫ్ మెషీన్ ఎలిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ సబ్జెక్టులను అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది.
 
 ముఖ్య సమాచారం
 దరఖాస్తు రుసుం: రూ. 200
 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు  మినహాయింపు ఉంది)
 ఖాళీల సంఖ్య: 440
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
 2016 అక్టోబర్ 26
 ప్రిలిమినరీ పరీక్ష తేది: 2017, జనవరి 8
 వెబ్‌సైట్: www.upsconline.nic.in
 
 గత విధానంతో పోల్చితే, కొత్త విధానంలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య తక్కువైనట్లు కనిపించినా వాటికి కేటాయించిన మార్కులు మాత్రం పెరిగాయి. ఇంజనీరింగ్ నైపుణ్యాలను పరీక్షించే స్టేజ్-2 పరీక్షలో సంబంధిత సబ్జెక్టుల్లో రెండు పేపర్లకు 300 మార్కుల చొప్పున నిర్ణయించారు. కాబట్టి అభ్యర్థులు ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ను లోతుగా చదవాలి. ప్రిలిమినరీ పరీక్షకు తక్కువ సమయం ఉంది కాబట్టి వీలైనన్ని ప్రివియస్ పేపర్ల సాధన, మాక్ టెస్టులు రాయడం లాభిస్తుంది.
 - పి.శ్రీనివాసులు రెడ్డి,
 సీఎండీ, వాణి ఇన్‌స్టిట్యూట్.
 
 ప్రిలిమినరీ పరీక్షకు ఉన్న మూడు నెలల సమయంలో ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలపై అభ్యర్థులు ఫోకస్ చేయాలి. స్టేజ్ -1లో అర్హత సాధిస్తేనే స్టేజ్-2కు అవకాశం లభిస్తుంది కాబట్టి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో చదవాలి. స్టేజ్ -2కు మూడు నెలల సమయం ఉంటుంది అందువల్ల కన్వెన్షనల్ పేపర్లకు సన్నద్ధమవ్వడానికి వీలవుతుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో గత ప్రశ్నలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గత పదేళ్ల ప్రివియస్ పేపర్లను సాధన చేయడం ఉపకరిస్తుంది.
 - సిద్ధిఖ్ హుస్సేన్,
 2016 ఐఈఎస్ విజేత. (ప్రొబేషనరీ
 ఆఫీసర్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్.)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement