మే 7 తర్వాతే మున్సిపల్ ఫలితాలు:సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలను నిలపి ఉంచాల్సిదేనంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ ఎన్నికల ఫలితాలపై సోమవారం విచారించిన సుప్రీంకోర్టు.. మే 7వ తేదీ తరువాతే ఫలితాలను వెల్లడించాలని ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం)కి ఆదేశాలు జారీ చేసింది. పరిషత్ ఎన్నికల ఫలితాలను కూడా నిలిపి ఉంచాలని గతంలో చెప్పామని రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడింది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిమతమని సుప్రీం పేర్కొంటూ, ఎన్నికల సంఘం వాదనలో నిలకడ లేదని అభిప్రాయపడింది. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపుతాయని సుప్రీం పేర్కొంది.
పరిషత్ ఎన్నికల వాయిదాకు గతంలో ఒప్పుకుని ఏవో కారణాలు చూపొద్దని సుప్రీం తెలిపింది. ఈవీఎంలు భద్రపరిచేందుకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలని ఈసీని ఆదేశించింది. భూకంపం వస్తుందని ఊహించుకుని లేనిపోని ఆందోళన చెందడం దేనికని ప్రశ్నించింది.