సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలా.. లేదా అన్న అంశంపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలపై అభిప్రాయం ఏమిటో వెల్లడించాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం విదితమే.
హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాదిరిగానే.. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించడంతోపాటు హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు ముందుకు ఈసీ తీసుకెళ్లనుందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం మధ్యాహ్నంలోగానే ఈ అంశం కోర్టులో విచారణకు రానున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఫలితాలపై నేడు సుప్రీం తీర్పు!
Published Mon, Apr 7 2014 2:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement