ఒక చెయ్యే చాలు..! | put a single hand | Sakshi
Sakshi News home page

ఒక చెయ్యే చాలు..!

Published Wed, Jun 18 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఒక చెయ్యే చాలు..!

ఒక చెయ్యే చాలు..!

విచిత్రం
 

షిట్లే ఒక చేత్తో కొడితే గోడలు కూడా బద్దలయిపోతాయ్.. ఒక్క పట్టు పట్టాడంటే ఆర్మ్ రెజ్లింగ్‌లో మహామహులే చిత్తయిపోతారు. మరో చేయి మాత్రం బక్కగా, పీలగా కనిపిస్తుంది. మరి ఒకే మనిషిలో ఇంత తేడా ఏమిటి అని ఆశ్చర్యపోతారెవరైనా. జర్మనీకి చెందిన ఇతడి పూర్తి పేరు మథియాస్ షిట్లే. ఒక ప్రొఫెషనల్ ఆర్మ్ రెజ్లర్. అతను ఒంటి చేత్తో ఎంతోమంది పోటీదారులను మట్టిగరిపించి క్లబ్‌స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక సార్లు విజేతగా నిలిచాడు. విశేషం ఏమిటంటే బాడీబిల్డర్‌కు ఉన్నట్టుగా కండలు తిరిగి ఉన్న ఇతడి కుడి చేయి అసహజంగా పెరిగింది. ఆర్మ్ రెజ్లింగ్ కోసం చేసిన వ్యాయామంతో కుడిచేయి కండలు తిరిగింది. ఎడమ చేయి మాత్రం ఇతడి సహజరూపానికి తగ్గట్టుగా ఉంది.

ఇతడు తొలిసారి 16వ ఏట రెజ్లింగ్ పోటీలో పాల్గొన్నాడట. సత్తా ఏమిటో స్వయంగా గుర్తెరిగాక, అక్కడి నుంచి చెలరేగిపోయాడు. వరుసగా జాతీయ స్థాయి పోటీలతోపాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటూ 14 చాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకొన్నాడు. చేతికుస్తీ పోటీల్లో ఎంతోమంది చాంపియన్లు ఉన్నా... ఈ కుడి చేతివాటం షిట్లే మాత్రం స్పెషలే!
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement