యూ క్యూబ్ విజ్
యూ క్యూబ్.. బాలికలపై లైంగిక దాడులకు నిరసనగా ఓ బాలిక వినిపించిన నిరసన గళం. మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆ అమ్మాయి పేరు మూర్చన రాయ్ చౌదరి. ప్లస్ టు చదువుతున్న ఈ అమ్మాయి హార్లిక్స్ విజ్ కిడ్స్ పోటీల్లో తన సత్తా చాటింది. బెంగళూరులో జరిగిన సౌత్ ఏసియా ఫైనల్స్‌లో విక్టరీ కొట్టి స్పెయిన్ ట్రిప్ అవకాశం దక్కించుకుంది. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది.
అసోంలోని గువాహటి మా స్వస్థలం. నాన్న బీఏ రాయ్‌చౌదరి కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీర్. అమ్మ కృష్ణా రాయ్‌చౌదరి గృహిణి. నాలుగేళ్ల కిందట నాన్నకు బదిలీ కావడంతో ఇక్కడకు వచ్చాం. చిన్నప్పటి నుంచి సామాజిక సవుస్యలపై పోరాడాలనే సంకల్పం ఉండేది. ఎక్కడ సేవా కార్యక్రవూలు జరిగినా హాజరయ్యేదాన్ని. చిన్మయి విద్యాలయ నిర్వహించిన చాలా కార్యక్రవూల్లోనూ చురుగ్గా పాల్గొన్నా. గతనెలలో శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగవుంలో నిర్వహించిన హార్లిక్స్ విజ్‌కిడ్స్ పోటీల్లో పాల్గొన్నా. ఇటీవల బెంగళూరులో జరిగిన సౌత్ ఏసియా ఫైనల్స్‌లో విజయం సాధించాను. నాతోపాటు ఈ పోటీలో విజయం సాధించిన ఐదుగురిని నిర్వాహకులు త్వరలోనే స్పెయిన్ పర్యటనకు తీసుకెళ్తున్నారు కూడా.
అఘాయిత్యాలను ఎదిరించాలనే..
బాలికలపై అత్యాచారాల గురించి నిరంతరం వార్తలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. సిటీలోని మా ఇంటి పరిసరాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరగడంతో ఈ అన్యాయూన్ని ఎందుకు ఎదిరించకూడదనే ఉద్దేశంతో ‘యుూ క్యూబ్’ ప్రాజెక్టుకు రూపకల్పన చేశా. మా స్కూల్ యూజవూన్యం చొరవతో ఈ కాన్సెప్ట్‌ను కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ఎన్జీవోలకు వివరించా. సిటీలోని ప్రైవేటు పాఠశాలలతో పాటు సర్కారీ బడుల్లోనూ అవగాహన కల్పిస్తానని వారికి చెప్పాను. స్పాన్సర్ చేసేందుకు వారు ఓకే అన్నారు. నాతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థులతో గ్రూపుగా ఏర్పడ్డాం.
ప్రైవేటు పాఠశాలలతో పాటు వుురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు అవగాహన కల్పించాం. మొదట్లో మేం చెప్పిన మాటలకు పిల్లలు నవ్వుకున్నారు. తర్వాత అర్థం చేసుకోవడం ప్రారంభించారు. పలు పాఠశాలల్లో బాలలపై లైంగిక వేధింపుల గురించి సెమినార్‌లు, అవగాహన కార్యక్రవూల్లో పాల్గొన్నా. ఇందులో భాగంగానే నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించిన 4కే రన్‌కు మంచి స్పందన లభించింది. ఈ నెల 10 నుంచి 14 వరకు బెంగళూరులో జరిగే హార్లిక్స్ విజ్‌కిడ్స్ జాతీయు స్థారుు పోటీల్లో ‘యుూ క్యూబ్’ ప్రాజెక్టు గురించి వివరించాను. దీనికి మంచి స్పందన లభించింది.
వాంకె శ్రీనివాస్