హిందువులకు తీరని అవమానం
‘‘రామమందిరం వివాదం తమకు ప్రధానం కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం హిందువుల మనోభావాలను అవమానించడమే. హిందువులకు ఎంతో విలువైన ఈ సమస్య కోర్టుకు అంత ప్రధాన విషయం కాకపోవడం బాధాకరం. దీపావళికి ముందే తీర్పు మాకు అనుకూలంగా వస్తుందనుకున్నాం. కానీ న్యాయస్థానం ఈ సమస్యను చిన్నచూపు చూడటం వల్ల కోట్లమంది హిందువులను బాధించినట్లయింది’’
– భయ్యాజీ జోషి, ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి
ఒత్తిడికి సాయం
‘‘రోజువారీ జీవితంలో మనం ఒత్తిడికి గురవుతాం. ఒక దశ వరకు అది సాధారణమే. మన ఉద్వేగం, మానసిక స్థితి, సామాజిక స్థితిపై ఒత్తిడి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఒత్తి డిని అదుపులో పెట్టుకోవడం ప్రతి దశలోనూ అవసరమే. ఈ విషయంలో సహాయం పొందడానికి సిగ్గుపడక్కర్లేదు’’
– కాజల్ అగర్వాల్, హీరోయిన్
చేతిలో సూర్యోదయం
‘‘అవినీతిమయమైన, నిరంకుశమైన, విభజించే శక్తులు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. బీజేపీ యేతర పార్టీలన్నీ ఏకం కావడానికి ఇదే తగిన సమయం. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాల ఐక్యతకు మద్దతునిస్తున్నాం’’
– స్టాలిన్, డీఎంకె అధ్యక్షుడు
తగిన మూల్యం
‘‘చాలా ఏళ్లుగా మాజీ మంత్రి ఎం.జె.అక్బర్ తో నేను మాట్లాడలేదు. అతడు చట్టానికి అతీతుడని భావించేదాన్ని. న్యాయాన్ని అతనికి వర్తింపజేయలేం అనుకున్నా. నాకు చేసిన దానికి అతడు ఎప్పటికీ తగిన మూల్యం చెల్లించడనుకున్నా. నాకంటే ముందు మాట్లాడిన జర్నలిస్టులందరికీ కృతజ్ఙతలు. వారి అండతోనే నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నా’’
– పల్లవి గొగోయ్, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment