హైదరాబాద్: రేషన్ డీలర్లకు కమీషన్ల పద్ధతి తొలగించి, తమిళనాడు తరహాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావుకు విజ్ఞప్తి చేసింది. ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్‌తో కలసి శనివారం సంఘం అధ్యక్షుడు నర్సింహ, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, గౌరవాధ్యక్షుడు దాసరి మల్లేష్ తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఉద్యోగ భద్రత కల్పిస్తే ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా డీలర్లు సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
రేషన్ డీలర్లపై నిఘా కోసం పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్‌ఓటీ) లను వెంటనే తొలగించాలని వారు కోరారు. డీలర్లకు కమీషన్ పెంచేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పగా, తమకు కమీషన్ విధానమే వద్దని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందో పరిశీలించి ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.
తమిళనాడు తరహా వేతనాలు ఇవ్వండి
Published Sat, Jul 25 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement