ట్రంప్ ముఖచిత్రాలతో టాయిలెట్ టిష్యూ పేపర్లు! | China-made Trump toilet paper popular in US: Report | Sakshi
Sakshi News home page

ట్రంప్ ముఖచిత్రాలతో టాయిలెట్ టిష్యూ పేపర్లు!

Published Mon, Jun 6 2016 2:11 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

ట్రంప్ ముఖచిత్రాలతో టాయిలెట్ టిష్యూ పేపర్లు! - Sakshi

ట్రంప్ ముఖచిత్రాలతో టాయిలెట్ టిష్యూ పేపర్లు!

బీజింగ్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనా తన ఆగ్రహాన్ని పరోక్షంగా తీర్చుకుంది. ట్రంప్ పేరిట టాయిలెట్ టిష్యూ పేపర్లను ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ పేపర్ రోల్స్ పై ట్రంప్ ముఖచిత్రాలను ముద్రించింనట్లు సమాచారం. చైనా తమదేశాన్ని రేప్ చేసిందని, తమ దేశంలోకి ఆ దేశ వస్తువులను డంప్ చేసి ఆర్థికపరమైన దోపిడికి పాల్పడిందని, తాను అధికారంలోకి రాగానే దానికి అడ్డుకట్టవేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలు చైనాకు చెందిన కంపెనీలు ఆయన ముఖ చిత్రాలతో టిష్యూ పేపర్ రోల్స్ ను ముద్రించి అమెరికా మార్కెట్లోకి విడుదల చేశాయి. ఆ పేపర్లకు స్లోగన్ గా 'డంప్ విత్ ట్రంప్' అని పెట్టాయి. ఈ టిష్యూ పేపర్లలో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. నవ్వుతున్నట్లు, బాధపడుతున్నట్లు, తలపట్టుకున్నట్లు, కోపంతో ఊగిపోతున్నట్లు డిఫెరెంట్ స్టిల్స్ తో ఉన్న ట్రంప్ ముఖచిత్రాలతో టిష్యూ పేపర్లను ముద్రించిన చైనా ఆ పేపర్ రోల్స్ ను విరివిగా అమెరికా మార్కెట్లోకి విడుదల చేసి భారీగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

ట్రంప్ ముఖచిత్రంతో కూడిన టాయిలెట్ పేపర్లు ఫిబ్రవరి మధ్య కాలంలో విపరీతంగా అమ్ముడు పోయాయని కింగ్ దావో వాల్ పేపర్ ఇండస్ట్రియల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మరోసారి ఐదువేల రోల్స్ కోసం 50 ఆర్డర్లు వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది. మొత్తానికి 70 సంస్థలు ఈ పేపర్లను చైనాలో, అమెరికాలో విక్రయిస్తున్నాయంట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement