సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన లక్షణాలు కలిగిన వారిని ట్రాక్ చేయడం కోసం లండన్‌లో ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తే బ్రిటన్ దేశం మొత్తం మీద 20 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయస్కులు 19 లక్షల మందికి కరోనా వైర స్ సోకినట్లు తేలింది. బ్రిటన్‌లోని లండన్, బిర్మింగమ్, మాన్‌చెస్టర్, గ్లాస్గో, లివర్‌పూల్ నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిటన్ శనివారం ఒక్క రోజే 684 మంది మరణించగా, ఇప్పటి వరకు 3,605 మంది మరణించారు. బ్రిటన్‌లో అధికారికంగా ఇప్పటి వరకు నిర్ధారించిన కేసులు 38,168 మాత్రమే. (విద్యుత్ దీపాల బంద్; కేంద్రం వివరణ)
గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, ఎన్‌ఐహెచ్‌ఆర్ బయోమెడికల్ రిసెర్చ్ సెంటర్, హెల్త్‌కేర్ స్టార్టప్–జో గ్లోబల్ లిమిటెడ్ సహకారంతో కింగ్స్ కాలేజ్ లండన్ బృందం ఈ ‘కోవిడ్ సిప్టమ్ ట్రాకర్’ను రూపొందించింది. ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు ఈ యాప్ యూజర్లలో 20–69 ఏళ్ల మధ్యనున్న 16,26,355 మంది యూజర్లు తమ లక్షణాలను నమోదు చేశారు. వీళ్లందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయితే 79,405 కేసులు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని యాప్‌ను రూపొందించిన పరిశోధకులు తెలిపారు. యూజర్లు తమ జబ్బు లక్షణాలను సరిగ్గా పేర్కొన్నట్లయితే ఈ యాప్ ద్వారా కరోనా వైరస్ బాధితులను కచ్చితంగా గుర్తించవచ్చని వారంటున్నారు. (’కరోనా అలర్ట్ @ ‘ఆరోగ్యసేతు’)
Comments
Please login to add a commentAdd a comment