మృతదేహాలను తీసుకొస్తున్న మరో హెలికాప్టర్
కఠ్మండు:నేపాల్ భూకంప బాధితుల పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్టర్ మంగళవారం ప్రమాదానికి గురైంది. దోలఖాలో పునరావాస సామాగ్రిని పంపిణీ చేసి తిరిగి వస్తున్న హెలికాప్టర్ యమునా దండా గ్రామంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు సహాయక సిబ్బంది దుర్మరణం చెందినట్లు నేపాల్ ఆర్మీ స్పష్టం చేసింది.
ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పేర్కొన్నారు. షిలా పరబాత్ అడవుల్లో హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపాడు.